తెలుగు బాషని నిలబెట్టాలని, కొన్ని పదాలు మరుగున పడకుండా చూడాలని ఈనాడు దినపత్రిక కంకణం కట్టుకుంది. మంచి ఆలోచనే కాని వాడుక లో లేని పదాలని వాడి, క్రొత్త పదాలని సృష్టించి అందరిని ఇబ్బంది పెడుతుంది.
మచ్చుకి కొన్ని ..
ఈనాడు | వాడుక |
హజం | పొగరు |
వణిక్ | వాణిజ్యం |
అంతర్జాలం | ఇంటర్నెట్ |
సామాజిక నెట్వర్కింగ్ | సోషల్ నెట్వర్కింగ్ |
గుత్తేదార్లు | కాంట్రాక్టర్స్ |
సంయుక్త సంచాలకుడు | జాయింట్ సెక్రటరీ |
వూబకాయం | ఓబెసిటీ |
ప్రాంగణ నియామకాలు | క్యాంపస్ ప్లేస్మెంట్స్ |
దృశ్య మాధ్యమ | visual media |
నిర్లవణీకరణము | desalination |
సమావేశ మందిరము | conference room |
ఖనిజ జలం | mineral water |
నా స్నేహితులలో కొంత మందికి తెలుగు చదవటమే రాదు. మరి చదవగలిగిన వాళ్ళకి బాష మీద మక్కువ పెంచాలన్నదే ఈనాడు ధ్యేయమా లేక బాష ని అభివృద్ది చేయాలనే భాద్యతను తన భుజస్కంధాల పైన తనే వేసుకున్నదా?
మరి ఇన్ని తెలుగు పదాలని వాడుతున్నవాళ్ళు దవాఖానా అనే పదాన్ని వాడారు! దవాఖానా అంటే ఆస్పత్రి. మరి దానికి ఉర్దూ బాష నుంచి వచ్చిన పదాన్నిఎందుకు వాడారో?
ఇంకొన్ని పదాలు గ్యాపకం లేవు. క్రొత్తవి ఏమైనా తారసపడినా, పాతవి గ్యాపకం వచ్చినా ఇక్కడ చేరుస్తాను. పాఠకులు, ఇక్కడ తప్పులు ఏమైన ఉంటే మన్నించి తమ సలహాలను కామెంట్స్ లొ తెలువలసినదిగా మనవి.
addendum : 05/15/2011 - ఖనిజ జలంని సూచించిన అశోక్ కి ధన్యవాదములుupdate
No comments:
Post a Comment